భర్త ప్రభుత్వ ఉద్యోగి కావడంతో టూర్లకు వెళ్లాల్సి వచ్చేది. ఈ క్రమంలో ఇంట్లో ఒక్కతే ఉండాల్సి వచ్చేది. ఈ క్రమంలో ఆమె మరో పురుషుడు తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.ఇటీవల బెడ్రూమ్ లో అతడితో శృంగారం చేస్తుండగా భర్త చూసి ప్రియుడిని కాల్చి చంపాడు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలోని వర్జీనియాకు చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వం ఉద్యోగం చేస్తూ ఉండేవాడు.
ఉద్యోగంలో భాగంగా అతను టార్లు తిరగాల్సి వచ్చేది. దీంతో అతడి భార్య ఇంట్లో ఒక్కతే ఉండాల్సి వచ్చేది. ఈ క్రమంలో ఆమె మరో పురుషుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతను వేరే టూర్లకు వెళ్లినప్పుడల్లా అతడిని ఇంటికి రప్పించుకుని రొమాన్స్ చేసేది.
ఇటీవల కూడా భర్త టూర్ కు వెళ్లగానే ఆమె ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని అతడితో బెడ్రూమ్ లో రొమాన్స్ చేస్తుంది. అయితే, భర్త ఆమెకు చెప్పకుండా ఇంటికి వచ్చి సర్ ప్రైజ్ ఇద్దామనుకున్నాడు. అలా ఇంటికి వచ్చిన భర్త ఆమెను అతడితో బెడ్రూమ్ లో చూసి షాకయ్యాడు. అనంతరం ఆగ్రహంతో రగిలిపోతూ అతడిపై 3 రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు.