చిత్తూరు జిల్లాలో రీ సర్వే కార్యక్రమాలు జరుగుతున్న ప్రాంతాల వివరాలు, రోజు వారీ ప్రగతి నివేదికలు ఇవ్వాలని అదేవిధంగా వారం వారీగా నివేదికలు సమర్పించి ఇచ్చిన లక్ష్యాలను సాధించే విధంగా చూడాలని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు.
సోమవారం సాయంత్రం రీ సర్వే కార్య క్రమానికి సంబం ధించి జరుగుతున్న అభివృద్ధి పై సర్వే అధికారులతో, జాయింట్ కలెక్టర్ సంబంధింత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఒక్కో మండలంలో మూడోవంతు భాగం గ్రామాలలో రీ సర్వే కార్యక్రమాలు నిర్వహించాలని, అలా నిర్వహించిన గ్రామాలకు సంబంధించి ఓ ఆర్ ఐ షీట్లు వచ్చిన తర్వాత గ్రౌండ్ ట్రూథింగ్, గ్రౌండ్ వ్యాలిడేషన్, తర్వాత చేయాల్సిన ప్రక్రియ కోసం కావాల్సిన విషయంలో ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అన్నారు. అదే విధంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని 13నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధం చేయాలని రీ సర్వే కార్యక్రమాలను వేగవంతంగా చేయాలనన్నారు.
ఇప్పటివరకు నాలుగు గ్రామాలకు 13 న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని మరో మూడు గ్రామాల్లో ఇవ్వనున్నామని తెలిపారు. నెలాఖరుకు మరో మొత్తం 12 గ్రామాలలో గ్రౌండ్ ట్రూథింగ్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. డ్రోన్ సర్వే నిర్వహించిన 56 గ్రామాలకు సంబంధించి 19 గ్రామాలకు ఓ ఆర్ ఐ షీట్లు రావాల్సి ఉందని, కొన్ని గ్రామాలకు సంబంధించి నివేదిక లు వచ్చిన వెంటనే మిగతా కార్య క్రమా లు నిర్వహిస్తామని తెలిపారు.