అనపర్తి గ్రామ దేవతలలో ఒక్కరైన శ్రీ భాపనమ్మ తల్లి 133వ జాతర మహోత్సవం శనివారం సాయంత్రం ఆలయ ప్రాంగణం లో ప్రారంభమైనది. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా సాదాసీదాగా జరిగిన జాతర కరోనా ఆంక్షలు లేకపోవడంతో కనుల పండువగా నిర్వహించారు. పెద్ద ఎత్తున విద్యద్దీపాలంకరణలతో ఆలయ ప్రాంగణంతో పాటు ఆలయం చుట్టుపక్కల వీధులను అలంకరించారు. అనపర్తితోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
జాతరలో భాగంగా గరగ నృత్యాలు, దేవీమూర్తుల వేషధారణలు , పలు విచిత్ర వేషధారణలు అందరిని ఆకట్టుకున్నాయి. గత రెండుళ్లుగా అమ్మవారి జాతర లేకపోవడంతో పెద్ద ఎత్తున భక్తులు జాతరకు తరలివచ్చారు . భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమం దొరబాబు యువజన అధ్యక్షులు కర్రి ధర్మారెడ్డి(దొరబాబు), కర్రి సత్యనారాయణరెడ్డి(మిలిటరీ), కర్రి వెంకటరెడ్డి(పులి) ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిపించారు.