వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సోమవారం మండల పర్యటన సందర్భంగా ప్రజలు నాయకులు ఘన స్వాగతం పలికారు. మొదట గొలగమూడి వెంకయ్య స్వామి ఆశ్రమం కి విచ్చేసిన మంత్రికి ఆశ్రమ ఈవో బాలసుబ్రమణ్యం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఆశ్రమ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కాకానికి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముందు అనికేపల్లి వైసిపి నేత కోడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన గుర్రాల రథం లో ఊరేగించారు. క్రేన్లు ఉపయోగించి గజమాలలను కాకాణి కి వేయించారు. అదేవిధంగా కసుమూరు దర్గా లో ప్రత్యేక పూజలు చేసిన దానికి ముజావర్లు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కంటే పల్లి, వెంకటాచలం, కనుపూరు, కసుమూరు గ్రామాల్లో ప్రజలు కాకాని పై పూలవర్షం కురిపించి హారతులు పట్టారు.