కార్యకర్తలకి అండగా నిలవడం అంటే ఒక సరికొత్త నిర్వచనం నేర్పింది జనసేన పార్టీ అనే చెప్పొచ్చు. ప్రమాద భీమా అని పెట్టి 5 లక్షలు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. అది కాకుండా చిన్న చిన్న ప్రమాదాలు జరిగిన వెంటనే స్థానిక నాయకులూ కూడా తమ వంతు సాయంగా కార్యకర్తలకు అండగా నిలవడం గమనార్హం. తాజాగా ... కంసాలిపాలెం గ్రామానికి చెందిన జనసైనికుడు రాపోలు శ్రీను ప్రమాదవశాత్తు కాంక్రీటుమిల్లర్ లో చేయిపడి, చేతికి గాయమయ్యింది. అతనికి నిడదవోలు నియోజకవర్గ పార్టీ తరుపున రూ. 50,000 అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రకార్యదర్శి ప్రియాసౌజన్య గారు, జిల్లా సంయుక్త కార్యదర్శులు పాల్గోన్నారు.