రాష్ట్రంలో పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలంటూ తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తరువాత స్థానిక ఆర్టీసీ RMO గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ప్రజలపై మోపిన భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రతి నిత్యావసర వస్తువు మీద ధర పెంచి , సామాన్యుల నడ్డి విరగదీస్తుంది ఈ ప్రభుత్వం అని అన్నారు. ప్రజలకు అనుకూలంగా ఉండేలా ప్రభుత్వాలు పనిచేయాలి కానీ ఇబ్బంది పెట్టెల ఉండకూడదు అని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు రాజా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa