స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయీస్ గుర్తింపు సంఘం ఎన్నికలు ఈ నెల 23న జరుగుతున్న నేపధ్యంలో స్టీల్ పరిరక్షణకోసం నిఖరంగా, నిజాయితీ సుదీర్ఘకాలం ఉద్యమిస్తున్న సిఐటియు మిత్రపక్షాల ప్యానల్ ‘గంట’ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని స్టీల్ ఉద్యోగులకు సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. కె. ఎస్. వి. కుమార్ పిలుపునిచ్చారు.
మంగళవారం పిఠాపురం కాలనీ సిఐటియు కార్యాలయంలో పబ్లిక్ సెక్టార్ కో ఆర్డినేషన్ కన్వీనర్ ఎస్. జ్యోతీశ్వరరావు, కో కన్వీనర్ కె. ఎం. కుమార్ మంగళం గార్లతో కలిసి ఆర్. కె. ఎస్. వి. కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ ప్రెస్‌మీట్‌లో కుమార్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం 2020లో స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తామని ప్రకటన చేసిన తరువాత అనేక రూపాల్లో ప్లాంట్ రక్షణకోసం ఉద్యమాలు చేపట్టింది. మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ప్లాంట్‌ను ఎలాగైనా ప్రైవేటీకరణ చేసేందుకు ప్లాంట్ నష్టాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంది. అయినా దానిని గుర్తింపు యూనియన్‌గా అన్ని కార్మిక సంఘాలను కూడగట్టి పెద్దఎత్తున అడ్డుకోగలిగింది.
కేంద్రంలో ఉన్న గత కాంగ్రెస్ హాయాంలో కూడా డిపార్టుమెంట్లు వారీగా ప్లాంట్‌ను అమ్మేయడానికి సిద్దపడితే దానిని అడ్డుకునే విధంగా సిఐటియు నాయకత్వంలో ఎంప్లాయీస్ పోరాటాలు చేపట్టారు. నాడు అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు వాటి అనుబంధ సంఘాలు అడ్డుకునే విధంగా ఉద్యమాలు చేపట్టకపోవడం దురదృష్టకరం.
ప్లాంట్‌ను దక్షిణకొరియా కంపెనీ పోస్కోకు కట్టబెట్టాలని చూస్తే సిఐటియు ఒంటిరిగానే అడ్డుకుంది. పోస్కో ప్రతినిధులను ప్లాంట్‌లోపలకు అడుగుపెట్టనివ్వలేదు. అనేక పోరాటాలు చేసి ఫలితంగా పోస్కోను వెనుకు నెట్టగల్గాం.
ప్లాంట్‌ను ఎలాగైనా అమ్మేస్తామని పార్లమెంట్‌లో ప్రధాని దగ్గర నుండి కేంద్రమంత్రులంతా ప్రకటనలు చేస్తున్నారు. విశాఖకు వచ్చిన నిర్మలాసీతారామన్‌ను, స్టీల్ మినిస్టర్‌ను అడ్డుకున్నది సిఐటియు.
ప్లాంట్ రక్షణకోసం సిఐటియు నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కోటి సంతకాల సేకరణతో పాటు విశాఖపట్నంలో జరుగుతున్న దీక్షల్లో అత్యధిక రోజులు సిఐటియు సంఘాల్లో ఉండే కార్మికులే కూర్చోవడం దీనికి నిదర్శనమన్నారు.
సిఐటియు నాయకత్వంలో డిసిఐ ఏ రకంగా అయితే ఉద్యమాలతో కాపాడుకున్నామో ఆ స్ఫూర్తితో స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకుంటామన్నారు. ప్లాంట్‌కు సొంతగనులు కేటాయించాలని వేలాది మందితో బ్లడ్‌ఫర్ మైన్స్ అనే కార్యక్రమంతో రక్తదాన శిభిరాలు నిర్వహించిన ఘనత సిఐటియుదేనన్నారు. రాష్ట్ర గవర్నర్‌తో ప్రశంసాపత్రం అందుకోవడం జరిగింది.
నేడు స్టీల్‌ప్లాంట్‌లో గుర్తింపు సంఘంగా సిఐటియు లేకపోతే ప్లాంట్‌ను ఈపాటికే అమ్మేసేవారన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమం సిఐటియు యొక్క చొరవ వలనే ముందుకు సాగుతోంది. రాష్ట్ర రాజధాని, దేశ రాజధానికి వెళ్ళి నిరసనలు చేపట్టాం.
రాష్ట్ర ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌కు ఇసుకరీచ్‌ను రద్దుచేస్తే ఐఎన్‌టియుసి, వైఎస్‌ఆర్‌టియు, టిఎన్‌టియుసి యూనియన్స్ ఏ మాత్రం నోరుమెదపలేదు. జార్ఘండ్‌లో ఉన్న బొగ్గుగనిని కేంద్ర ప్రభుత్వం రద్దుచేస్తే రాష్ట్ర వైసిపి, తెలుగుదేశం, జనసేన ఒక్క ప్రకటన కూడా చేయలేదు సరికదా వాటి అనుబంధ యూనియన్లు కూడా ఖండిరచలేదు.