శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ లక్ష్యంగా పని చెయ్యాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. పోక్సో కేసుల విచారణ వేగవంతం చేయాలి ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కారించి , ప్రాపర్టీ నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మంగళవారం బాపట్ల జిల్లా పోలీసు కార్యాలయంలో బాపట్ల, చీరాల సబ్ డివిజన్ డీఎస్పీలు, సిఐలు అధికారులతో నేర సమీక్షా సమావేశమును నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశం నందు ఎస్పీ మాట్లాడుతూ దర్యాప్తులో ఉన్న పొక్సో కేసులు గ్రేవ్ కేసులపై సమీక్షించారు.
సర్కిల్ వారిగా పెండింగ్ కేసుల వివరాలు, నమోదైన కేసుల్లో నేరస్తుల అరెస్టు, దర్యాప్తు తీరుతెన్నులపై జిల్లా ఎస్పీ అధికారులను ఆరా తీసి సంబంధిత కేసుల ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించినారు. పోలీస్ స్టేషన్ల వారీగా యూఐ కేసులు తగ్గించుకోవాలని, నిర్ణీత గడువులోపు దర్యాప్తు పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించారు.
జిల్లాలో ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న పోక్సో కేసులను ఎస్పీ సమీక్షించి, త్వరితగతిన పెండింగ్ లను పూర్తీ చేయాలన్నారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.