ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్మీ ట్రైనింగ్ అంత తేలిక కాదు: సినిమా ఫీట్లను తలపించేలా

national |  Suryaa Desk  | Published : Wed, Apr 20, 2022, 01:32 AM

 


ఆర్మీ అంటే అంత ఈజీ కాదు. కఠోర ట్రైనింగ్ తో మన దేశ సైనికులు మనల్నీ కాపాడుతున్నారు. ఇండియన్ ఆర్మీని చూడగానే మనలో తెలియని దేశభక్తి ఉప్పొంగుతుంది. మన చెయ్యి ఆటోమేటిక్‌గా సెల్యూట్ చేస్తుంది. ఎందుకంటే సైనికులంటే మనకు అంత ఇష్టం. మనం సంతోషంగా ఉండటం కోసం వాళ్లు తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి... సరిహద్దుల్లో పహారా కాస్తూ దేశాన్ని కాపాడుతుంటారు. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఎటు నుంచి ఉగ్రమూకలు చొరబడి కాల్పులు జరుపుతాయో అంచనా ఉండదు. ఎక్కడ మందుపాతర పేలుతుందో అర్థం కాదు. ప్రాణానికి గ్యారెంటీ ఉండదు. అలాంటి టఫ్ లైఫ్ వారిది. మరి సైనికులు తీసుకునే ట్రైనింగ్ కూడా అంతే టఫ్‌గా ఉంటుంది. అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఆ వీడియోని గమనిస్తే... అది అడవిలోని ఓ పెద్ద చెట్టు దగ్గర ఉన్న బురద సొరంగం. అందులో ఒకవైపు నుంచి దూరి... మరోవైపుకి రావాలి. అసలే బురద. లోపలికి వెళ్తే ఏమీ కనిపించదు. ఆ బురదలో ఏ పాము ఉందో, ఏ పురుగు ఉందో అర్థం కాదు. కానీ అందులోంచే వెళ్లాలి. అదే టఫ్ ట్రైనింగ్. ఓ సైనికుడిని అందులో దూరమని బాస్ ఆర్డరివ్వగా.. ఆ సైనికుడు మొదట బురదలో పూర్తిగా మునిగి... కష్టం అనిపించి... పైకి లేచాడు. కానీ బాస్... ధైర్యం నింపి... ముందుకు సాగమని ఆదేశించడంతో... ఆ సైనికుడు మరింత ధైర్యంగా బురదలో దూరాడు. అదే దూకుడుతో... సొరంగం మరోవైపు నుంచి బయటకు వచ్చాడు. అతని ఒళ్లంతా బురద అంటుకుంది. క్షణం కూడా ఆగకుండా... వెంటనే అక్కడి నుంచి పరుగెడుతూ వెళ్లాడు. అదీ సైనికులు తీసుకునే ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ వీడియోని IAS ఆఫీసర్ అవనీష్ శరణ్... ట్విట్టర్ లోని తన అకౌంట్ @AwanishSharan లో ఏప్రిల్ 18, 2022న పోస్ట్ చేశారు. ఈ వీడియోని ఇప్పటివరకు 84 వేల మందికి పైగా చూశారు. 9వేల మందికి పైగా లైక్ చేశారు.


ఈ వీడియో నెటిజన్లలో దేశ భక్తిని రగిలిస్తోంది. ఇండియన్ ఆర్మీపై ఉన్న ఇష్టాన్ని మరింత పెంచుతోంది. "సెల్యూట్. నా కృతజ్ఞతను తెలుపుతున్నాను. మెచ్చుకుంటున్నాను. నిజమైన హీరోలు" అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా... "మిమ్మల్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. ఇండియన్ సైనికులు నా నిజమైన హీరోలు" అని మరో యూజర్ మెచ్చుకున్నారు.


ప్రిడేటర్ సినిమా సీన్:


ఈ వీడియోని చూసినప్పుడు 1987 నాటి ప్రిడేటర్ సినిమా (predator movie 1987) గుర్తు రావడం సహజం. అందులో హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్... ఓ భయంకరమైన గ్రహాంతరవాసిని చంపేందుకు ఒంటి నిండా బురద పూసుకుంటాడు. ఆ సినిమాలో అతను కూడా సైనికుడే. బురద పూసుకోకపోతే... ఆ ఏలియన్‌కి ఆర్నాల్డ్ కనిపిస్తాడు. అలా కనిపించిన మరు క్షణం ఆ ఏలియన్ చంపేయగలదు. కాబట్టే కళ్లలో తప్ప ఒళ్లంతా బురద పూసుకున్న హీరో... ఏలియన్‌తో ఎలా పోరాడాడన్నది ఆ సినిమా కథనం. అప్పట్లో అదో సంచలన మూవీ. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ రియల్‌గానే బురదలో టఫ్ ట్రైనింగ్ తీసుకుంటూ... ఆ ఏలియన్ కంటే భయంకరమైన ఉగ్రవాదుల ఆటకట్టిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com