తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎర్ర చందనం కూలీలను మహానంది పోలీసులు పట్టుకున్నారు. 15 మంది మహానందిలోని టీటీడీ వసతిగృహాల సముదాయంలో రెండు గదులను అద్దెకు తీసుకుని ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సీఐ రవీంద్ర, మహానంది ఎస్ఐ నాగార్జునరెడ్డి పోలీసులతో కలిసి వెళ్లి వసతి గృహాల్లో తనిఖీలు నిర్వహించి వారిని పట్టుకుని మహానంది పోలీస్ స్టేషన్ కు తరలించారు.