నంద్యాలలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్స్‌తో పాటు నంద్యాల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల వివరాల రికార్డులను కోర్టు ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది.
నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన 50 ఎకరాల భూమిని వైద్య కళాశాల నిర్మాణం కోసం బదలాయిస్తూ ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పాలకమండలి గతేడాది జూన్ 20న చేసిన తీర్మానాన్ని సవాల్ చేస్తూ బొజ్జా దశరథరామిరెడ్డి, మరో నలుగురు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.