రాష్ట్రంలో రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది అని చెప్పేవాళ్ళే తప్ప రైతులను ఆదుకోవడంలో ప్రతి ప్రభుత్వం విఫలమైనదనే చెప్పాలి. ఐతే దీని మీద స్పందించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రైతులకి అండగా జనసేన నిలుస్తుంది అని ప్రకటించి రైతు భరోసా యాత్ర మొదలు పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా మొదటగా అనంతపురం జిల్లాని ఎంచుకొని ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో వారిని పరిగణలోకి తీసుకొని వారి కుటుంభ సభ్యులకి ఆసరాగా లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. గత నాలుగు రోజులుగా జరుగుతున్నా ఈ యాత్ర నేటితో ఈ జిల్లాలో ముగిసింది. మొత్తం 31 మంది బాధితులను గుర్తించి వారికీ సాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులూ మాట్లాడుతూ... జనసేన రైతు భరోసాయాత్ర మొదటి విడతలో భాగంగా అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన 31 మంది కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, ఒక్కొక్క రైతు కుటుంబానికి తన కష్టార్జితం లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేసి రైతులకు అండగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ నిలిచారన్నారు.