కోడూరు మండల తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో పెంచిన ఆర్టీసీ చార్జీలు, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ నినాదాలతో బుధవారం కోడూరు ప్రధాన సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా. రాష్ట్ర ప్రభుత్వం సామాన్యుడిపై విధించిన ఆర్టీసీ టికెట్ చార్జీలను, విద్యుత్ అదనపు ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి కోడూరు మండల అధ్యక్షులు బండే శ్రీనివాసరావు, టిడిపి నాయకులు కాగిత రామారావు, బడే భావన్నారాయణ, మద్దూరి కాంతారావు, గుడిసేవ సూర్యనారాయణ, కొప్పనాతి సత్యనారాయణ, బోలిశెట్టి విఠల్ రావు, వేములపల్లి రాజేష్ , బడే ఆదినారాయణ, బడే వీరబాబు, బడే గాంధీ, ఉప్పాల పోతురాజు, ఉప్పాల కొటేశ్వరావు, తోట రాంబాబు, కొండవీటి నాగేశ్వరావు, ధావు చినబాబు, వీరంకి వెంకన్న, మేకా రమేష్, బచ్చు పూర్ణచందర్రావు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa