ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.71వేల స్కూటీకి రూ.15.44లక్షల ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్!

national |  Suryaa Desk  | Published : Wed, Apr 20, 2022, 03:21 PM

చండీగఢ్​లోని సెక్టార్​-23లో నివాసముండే బ్రజ్​మోహన్ అనే 42 ఏళ్ల వ్యక్తి తన స్కూటీకి ఫ్యాన్సీ నంబర్​ ప్లేట్​ కోసం ఏకంగా రూ.15.44 లక్షలు ఖర్చు చేశాడు. అతను ఇటీవలే రూ.71వేలతో హోండా యాక్టివా కొనుగోలు చేశాడు. దానికి ఫ్యాన్సీ నంబర్​ ప్లేట్ కోసం చండీగఢ్​ రిజిస్ట్రేషన్​ అండ్ లెసైన్సింగ్ అథారిటీ నిర్వహించిన వేలంపాటలో పాల్గొన్నాడు. చివరకు రూ.15.44లక్షలతో 'CH01-CJ-0001' వీఐపీ నంబర్​ను దక్కించుకున్నాడు.


ఈ వేలంపాటను ఏప్రిల్​ 14-16 మధ్య నిర్వహించారు. మొత్తం 378 ఫ్యాన్సీ నంబర్లను వేలం వేయగా రూ.1.5కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ ఫ్యాన్సీ నంబర్​ ను కేవలం స్కూటీ కోసమే తీసుకోలేదని బ్రజ్​మోహన్ చెప్పారు​. భవిష్యత్తులో ఇదే నంబర్ ​ను కారు నంబర్​ ప్లేట్​గా ఉపయోగిస్తానని తెలిపారు. ఇప్పుడు మాత్రం హోండా యాక్టివాపైనే ఈ నంబర్​ కన్పిస్తుందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa