ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోహ్లీ రికార్డ్ ను బద్దలు కొట్టిన కే.ఎల్.రాహుల్

sports |  Suryaa Desk  | Published : Wed, Apr 20, 2022, 03:38 PM

టీ 20 క్రికెట్ లో అరుదైన రికార్డును కే.ఎల్.రాహుల్ నెలకొల్పాడు. టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ రికార్డును.. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బద్దలు కొట్టాడు. టీ20 క్రికెట్ లో ఓ గొప్ప రికార్డును నమోదు చేశాడు. భారత్ తరఫున టీ20ల్లో అత్యంత వేగంగా 6 వేల పరుగులు పూర్తిచేసిన బ్యాటర్ గా రికార్డుల్లోకెక్కాడు. తద్వారా విరాట్ కోహ్లీ రికార్డును రాహుల్ తిరగరాశాడు. 


184 ఇన్నింగ్స్ లలో కోహ్లీ 6 వేల పరుగుల మార్కును అందుకోగా.. రాహుల్ కేవలం 166 ఇన్నింగ్స్ లలోనే ఈ ఘనతను అందుకోవడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఈ జాబితాలో క్రిస్ గేల్ , పాక్ కెప్టెన్ బాబర్ ఆజంలు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. కాగా, భారత్ తరఫున శిఖర్ ధావన్ 214 ఇన్నింగ్స్ లు, సురేశ్ రైనా 217 ఇన్నింగ్స్ లు, రోహిత్ శర్మ 228 ఇన్నింగ్స్ లలో ఈ రికార్డును నమోదు చేశారు. 


నిన్న రాత్రి బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో 24 బంతుల్లో 30 పరుగులు చేసిన రాహుల్.. అతి తక్కువ ఇన్నింగ్స్ లలో 6 వేల పరుగుల మైలురాయిని చేరిన బ్యాటర్ గా ఘనతకెక్కాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa