రోడ్డు వేయమని అడిగినందుకు కర్ణాటకలో ఓ ఎమ్మెల్యే ఓ యువకుడి చెంప చెల్లుమనిపించడం వివాదాస్పదంగా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలానికి సరిహద్దు ప్రాంతమైన కర్ణాటకలోని తూముకూరు జిల్లా పావగడ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకటరమణప్ప తన నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటనకు వెళ్లారు. ఓ గ్రామంలోని యువకుడు ఎమ్మెల్యేను రోడ్డు వేయాలని నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే యువకుడిపై చేయిచేసుకున్నారు. పోలీసులకు పట్టిస్తానని బెదిరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు ఆ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే చాలా పెద్దాయన అని, అందుకే తనను కొట్టినా వదిలేశానని, తనకేం భయం లేదని ఆ యువకుడు చెప్పాడు.