ఏజెన్సీ ప్రాంతాల్లో కనీసం నడవడానికి సరైన రోడ్డు ఉండదు. ఆస్పత్రులకు వెళ్లాలన్నా నడిచే వెళ్లాలి. ముఖ్యంగా ప్రసవం సమయంలో గర్భిణీలను మంచంపై పడుకోబెట్టి మోసుకెళ్తుంటారు. ఇక ప్రస్తుతం అలాంటి ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని మంచంపై ఆస్పత్రికి మోసుకెళ్తున్న ఓ కుటుంబానికి ఓ జవాన్ సహాయం చేశాడు. చత్తీస్గఢ్లోని దంతేవాడలో ఓ గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న ఓ ఫ్యామిలీకి జిల్లా రిజర్వ్ గార్డ్ ఫోర్స్ జవాన్ హెల్ప్ చేశారు. అడవి బాటలో ప్రయాణిస్తూ ఆమెను మోసుకుని తీసుకెళ్లారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి ఆమెకు వైద్యం అందేలా చేశారు.