ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఏబీ వెంకటేశ్వరరావును మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. సస్పెన్షన్ విధించిన రెండేళ్ల తర్వాత కొనసాగింపు కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.