ఏపీ సీఎం జగన్ శుక్రవారం ఒంగోలులో పర్యటించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల్లోని మహిళల ఖాతాల్లో వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం డబ్బులు జమ చేశారు. బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. 'తొలి ఏడాది సున్నా వడ్డీ కింద రూ.1258 కోట్లు చెల్లించాం. రెండో ఏడాది సున్నా వడ్డీ కింద రూ.1096 కోట్లు చెల్లించాం. వరుసగా మూడో ఏడాది రూ. 1261 కోట్లు చెల్లిస్తున్నాం' అని అన్నారు. గడిచిన మూడేళ్లలో కోటి 2లక్షల 16 వేలమందికి పైగా మహిళలకు మేలు కలిగిందని అన్నారు.