విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో యువతిపై అత్యాచారం దుర్మార్గమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. 'రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరువవుతోంది. ఆస్పత్రిలో సెక్యూరిటీ లోపం ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదు. దిశ చట్టం ఇప్పటికీ అమల్లోకి రాలేదు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి' అని పవన్ కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa