రాయదుర్గం పట్టణంలోని మెలకల్మూరు రోడ్డులో గత పది రోజులుగా తాగునీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ స్థానికులు రోడ్డు పై ఖాళీ బిందెలతో బైఠాయించారు. శనివారం ఉదయం నుండే పెద్ద ఎత్తున కమీషనర్ వచ్చి సమస్య పరిష్కారించేంతవరకూ తగ్గేదేలే అంటూ నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ప్రధాన రహదారి కావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. మెలకల్మూరు, గొల్లపల్లి రోడ్డులో రాకపోకలు ఆగిపోయాయి