విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలేకాని డ్రగ్స్ తో తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోరాదని రూరల్ ఎస్సై శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఎస్కేపి డిగ్రీ కళాశాలలో యాంటీ డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై విద్యార్థులతో మాట్లా డుతూ తల్లిదండ్రులు తమ పిల్లలు విద్యా వంతులు కావాలన్న ఆశతో కళాశాలకు పంపుతారన్నారు.
ఐతే కొందరు విద్యా ర్థులు చెడు వ్యస నాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. కావున విద్యపై దృష్టిపెట్టి తమ జీవితాలకు బంగారు బాటలు వేసుకోవాలని విద్యార్థు లకు సూచించారు.