తాము ఆడ పిల్లలమనే సంగతిని వారు మరిచారు. నడిరోడ్డుపై జుట్టు లాక్కుంటూ, పిడి గుద్దులు కురిపిస్తూ ఒకరినొకరు గాయపర్చుకున్నారు. ఏపీలోని విజయవాడ కేబీఎన్ కాలేజీ వద్ద శుక్రవారం ఈ ఘర్షణ జరిగింది. రోడ్డుపై వచ్చీపోయే వారు చూస్తున్నారనే స్పృహ కూడా లేకుండా విద్యార్థినులు కొట్టుకున్నారు. దీనిని ఆపాల్సిన సహచర విద్యార్థులు చోద్యం చూశారు. కొందరు దీనిని వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టడంతో వెలుగులోకి వచ్చింది. వారు ఎందుకు కొట్టుకున్నారో తెలియలేదు. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.