నీతి ఆయోగ్ చైర్మన్‌గా రాజీవ్ కుమార్ హఠాత్తుగా రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా సుమన్ కె బేరీని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నియమించింది. ఆయన మే 1, 2022 నుండి బాధ్యతలు స్వీకరిస్తారని అధికారిక ఉత్తర్వుల్లో ఉంది. రాజీవ్ కుమార్ పదవీ కాలం ఏప్రిల్ 30తో ముగియనుంది. ప్రముఖ ఆర్థికవేత్తగా పేరొందిన రాజీవ్ కుమార్ ఆగస్టు 2017లో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. వ్యవసాయం, అసెట్ మానిటైజేషన్, డిజిన్వెస్ట్‌మెంట్, ఎలక్ట్రిక్ వాహనాలు మొదలైన వాటిపై రాజీవ్ కుమార్ దృష్టి సారించారు. వాటి అమలులో నీతి ఆయోగ్ విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థికశాస్త్రంలో డీ ఫిల్, లక్నో విశ్వవిద్యాలయం నుండి పీహెచ్‌డీ పట్టా పొందారు. అయితే ఆయన అకస్మాత్తుగా రాజీనామా చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.