జీలకర్ర అనగానే పోపులో వాడే పదార్ధాల్లో ఒకటిగా మాత్రమే చాలా మంది చూస్తారు. వీటి వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. జీలకర్ర మరిగించిన నీటిని తాగడం వల్ల అసిడిటీ, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. జీలకర్రలో ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి నానబెట్టిన నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. రోజూ పరగడుపున ఈ నీటిని తాగితే ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలున్నాయి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడే వారికి ఇది దివ్యౌషధంగా పని చేస్తోంది. చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇక శ్వాసకోశ సమస్యలకు జీలకర్ర నీటిని తాగితే చక్కటి పరిష్కారం లభిస్తుంది. లివర్‌లో పేరుకుపోయిన విషపదార్థాలను శరీరం బయటకు పంపడంలో జీలకర్రలోని ఔషద గుణాలు పని చేస్తాయి. ఇక చర్మం కాంతివంతంగా మెరవడంలోనూ జీలకర్ర దోహదపడుతుంది. జుట్టు సమస్యలకు కూడా జీలకర్ర సాయపడుతుంది. జీలకర్ర నానబెట్టిన నీటిని తాగితే జుట్టు కుదుళ్లు బలంగా ఉంటాయి.