యూపీలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని హత్య చేసిన ఘటన ప్రయాగ్ రాజ్ జిల్లాలో కేవ్ రాజ్ పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన వారిని హత్య చేశాక గుర్తు తెలియని దుండగులు ఇంటికి నిప్పు పెట్టి పరారయ్యారు. స్థానికులు మంటలను గమనించి పోలీసులకు తెలియజేశారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరి కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలంలో పరిశీలించారు. హత్యలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన మాదిరిగానే నవాబ్ గంజ్ జిల్లాలో కూడా ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని గతవారం దారుణంగా హత్య చేయడం జరిగింది. రెండు ఘటనలకు ఒకరే నిందితులా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.