ఈ రోజు కురుపాం నియోజకవర్గంలో MDB గ్రాంటు ద్వారా 33 కోట్లతో మంజూరు కాబడిన తోటపల్లి నుండి కురుపాం వరకు ( తోటపల్లి గుణుపూరు రోడ్డు) శరవేగంగా జరుగుతున్న 14 km రోడ్డు వెడల్పు మరియు అభివృద్ది పనులను ఎమ్మెల్యే , మాజీ మంత్రి పాములా పుష్ప శ్రీవాణి పరిశీలించడం జరిగింది. ఆర్ అండ్ బీ అధికారులకు మరియు కాంట్రాక్టర్ కు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పదవులతో సంభంధం లేకుండా ప్రజలకి సేవ చెయ్యడానికి ఎల్లప్పుడూ ముందంజలో ఉంటాము అని అన్నారు.