ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్త ఇంటి ముందు భార్య ధర్నా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 23, 2022, 04:48 PM

పోలీస్ స్టేషన్ లొ ఫిర్యాదు చేసినా తనకు న్యాయం దొరకలేదంటూ ఓ వివాహిత తన భర్త ఇంటి ముందు నిరసనకు దిగిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం యర్రబాలెం లో శనివారం జరిగింది. మహిళల రక్షణకు అనేక చట్టాలు వచ్చినప్పటికీ న్యాయం జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


భాదితురాలు తెలిపిన వివరాల మేరకు తన బంగారం, తన పేరుపై లోన్లు పెట్టి తనను మోసం చేశాడంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యు చేసినా తనకు న్యాయం చేయలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త ఎర్రబాలెం లోని వారి బంధువుల ఇంట్లో ఉన్నారని తెలిసినప్పటికీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా తనకు న్యాయం చేయలేదంటూ బాధితురాలు చెబుతుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com