రాష్ట్ర ప్రధాన రహదారిపై గురువారం రాత్రి నడికూడి రైల్వే వంతెన సమీపంలో జరి గిన ప్రమాదంలో పది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. కారు, ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొని తీవ్ర గాయాలైన వారిని వెంటనే గురజాల ప్రభుత్వాసుప త్రికి తరలించారు. దుర్గి మండలం ఓబులేసునిపల్లెకు చెందిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండ టంతో గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. వారిలో మాచర్ల మార్తమ్మ (35) అక్కడ చికిత్స పొందుతూ శుక్ర వారం మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నట్లు పోలీస్ స్టేషన్ రైటర్ రమేష్ చెప్పారు.