పెట్రోల్ పాలెం గ్రామంలో శనివారం జరిగిన వాలంటీర్ల సేవ పురస్కారాల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి నేలపై బైఠాయించారు. అందుకోసం పెద్ద సింహాసనం లాంటి కుర్చీ వేసినా కూడా, పక్కనే కొందరు మహిళలు నేలపైనే కూర్చొని ఉన్నారు. అది గమనించిన ఎమ్మెల్యే కోన రఘుపతి ఆయన కూడా వారితో పాటు నేలపై కూర్చొని ప్రసంగించారు.
ఇలా ఎమ్మెల్యే నేలపై బైటాయించడం అక్కడ ఉన్న వారికి ఆశ్చర్యం కలిగించింది. అనంతరం వాలంటీర్లకు సేవ పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల సిబ్బంది, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.