ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మగవాళ్లతో మాట్లాడుతుందని భార్యను చంపేశాడు

Crime |  Suryaa Desk  | Published : Sun, Apr 24, 2022, 09:06 AM

ఆలూమగల మధ్య గొడవలు దారుణాలకు దారి తీస్తున్నాయి. కలిసి కూర్చుని, మాట్లాడుకుని పరిష్కరించుకోవాల్సింది పోయి మనస్పర్థలు పెంచుకుంటున్నారు. ఇక తమ భార్య వేరే మగవాళ్లతో మాట్లాడుతోందని ఓ భర్త అనుమానం పెంచుకున్నాడు. సెల్‌ఫోన్‌లో ఎవరితో మాట్లాడినా ఆరా తీసేవాడు. తరచూ గొడవపడి, ఆగ్రహం పట్టలేక భార్య ప్రాణాలు తీశాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.


చెన్నై ట్రిప్లికేన్‌కు చెందిన పుగల్‌కొడి అలియాస్‌ ఢిల్లీ (29) ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. అతడికి సరిత (21) అనే యువతితో గతేడాది వివాహమైంది. ఆమె ఓ ప్రైవేటు హోటల్‌లో పని చేస్తోంది. సజావుగా సాగుతున్న వీరి సంసారంలో ఫోన్ కాల్స్ చిచ్చు పెట్టాయి. సరిత తరచూ ఇతర మగవాళ్లతో మాట్లాడుతోందని ఢిల్లీ అనుమానించే వాడు. దీంతో ఇద్దరి మధ్య చాలా సార్లు ఈ విషయంలో గొడవలు అయ్యాయి. ఇటీవల కాలంలో సరిత తన స్నేహితుడు జగదీశన్‌తో ఎక్కువ సమయం ఫోన్‌లో మాట్లాడడం ఢిల్లీ గమనించాడు. ఇది తప్పని చెప్పాడు. వారిద్దరి మధ్య మరోసారి గొడవైంది. 17వ తేదీన వీరిద్దరి మధ్య గొడవ పెద్దదైంది. ఆ సమయంలో భార్య సరితను ఢిల్లీ దారుణంగా కొట్టాడు. దీంతో ఆమె గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. శుక్రవారం వారం తుది శ్వాస విడిచింది. దీంతో పోలీసులు ఆమె భర్త ఢిల్లీని అరెస్టు చేసి జైలుకు పంపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com