ఓ వ్యక్తి 26 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి నిర్దోషిగా విడుదలయ్యాడు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..1993 జూన్ 11న బీహార్ రాష్ట్రంలోని గోపాల్గంజ్ జిల్లాలోని భోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే సూర్యనారాయణ్ భగత్ అనే వ్యక్తి తన ఫ్రెండ్ బీర్బల్ భగత్ తో కలిసి పనికి వెళ్లాడు. అక్కడికి వెళ్లాక సూర్యనారాయణ్ హత్యకు గురయ్యాడు. దీంతో సూర్యనారాయణ్ కుమారుడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయగా పోలీసులు బీర్బల్ భగత్ ను కస్టడీలోకి తీసుకున్నారు.
గోపాల్ గంజ్ ఏరియా పోలీసులు బీర్బల్ ని 1994 జనవరి 27న తన ఫ్రెండు సూర్యనారాయణ్ భగత్ ని హత్య చేశారన్న ఆరోపణలపై కస్టడీకి తీసుకున్నారు. అప్పటి నుంచి జైలు జీవితం అనుభవిస్తున్న బీర్బల్ ఒక్కరోజు కూడా బెయిల్ పై బయటకు రాలేదు. 1995 ఫిబ్రవరి 28న ఈ కేసులో పోలీసులు చార్జ్ షీట్ నమోదు చేశారు. అయితే, కోర్టులో ఈ విచారణ మెల్లగా సాగింది. కోర్టులో కేసుకు సంబంధించి ఎవరూ ముందుకు రాకపోగా సరైనా ఆధారాలు కూడా లేవు. దీంతో ఈ కేసును కొట్టి వేసింది. నిర్దోషి అని తేలగానే బీర్బల్ కోర్టులోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనను ఆదుకోవాలని కోర్టును వేడుకున్నాడు.