మహారాష్ట్రలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీడ్ జిల్లాలో నంద్గావ్ ఫాటా వద్ద రెండు వాహనాలు బలంగా ఢీకొన్నాయి. పోలీసులు చేరుకుని వాహనాల మధ్యన చిక్కుకుని ఉన్న మృతదేహలను వెలికి తీశారు. ఘటన స్థలంలోనే ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. క్షత గాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. వారిలో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురిని అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
బాధితులు లాతూర్ జిల్లాలోని సాయి, అర్వి గ్రామస్తులు. మృతులను నిర్మలా సోమవంశీ (38), స్వాతి బోడ్కే (35), శకుంతల సోమవంశీ (38), సోజర్బాయి కదం (37), చిత్ర షిండే (35), ఖండూ రోహిలే (35, డ్రైవర్) మరియు తొమ్మిదేళ్ల బాలుడుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.