జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఏపీలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ఆయన సాయం అందిస్తున్నారు. అందులో భాగంగా ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలు రైతు కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నారు. నేడు కూడా చింతలపూడిలో ఆయన పర్యటిస్తుండగా భారీగా జనసందోహం తరలి రావడంతో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో పవన్ అభిమానులను పోలీసులు అదుపు చేయడం చాలా కష్టమైంది. ఈ క్రమంలో తోపులాట కారణంగా ఓ పోలీసు అధికారి రోడ్డు పక్కకు పడిపోవడంతో వెంటనే స్పందించిన పవన్ కల్యాణ్ ఆ పోలీసు అధికారిని చేయిపట్టుకుని పైకిలేపడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.