తాడిపత్రి పట్టణంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడినా, విక్రయించినా జరిమానాలు తప్పవని మున్సిపల్ కమీషనర్ శివారెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడిపత్రి మున్సిపాలిటీలో 2006 జనవరి 26 వతేదీ నుండి ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకంపై విషేధించడం జరిగిందన్నారు.
మైక్రాన్లతో సంబంధం లేకుండా పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే అన్ని ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, టి కప్పులు, పిపి కవర్లు, పౌర సంఘాలు మరియు సమాజ ప్రమేయంతో పూర్తిగా వినియోగంపై నిషేధించబడ్డాయన్నారు. కావునా వాటిని ఎవరైనా వాడినా, విక్రయించినా వారికి జరిమానా విధించడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.