ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాలను మూటగట్టుకొని...ముగిసిన స్టాక్ మార్కెట్

national |  Suryaa Desk  | Published : Mon, Apr 25, 2022, 09:38 PM

స్టాక్ మార్కెట్ కు నష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈ ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు నష్టాల్లోనే కొనసాగాయి. కీలక రేట్లను యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పెంచడం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 617 పాయింట్లు నష్టపోయి 56,579కి పడిపోయింది. నిఫ్టీ 218 పాయింట్లు కోల్పోయి 16,953 వద్ద స్థిరపడింది. బ్యాంకెక్స్ మినహా అన్ని సూచీలు నష్టపోయాయి.  


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:


హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.75%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.73%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (0.28%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (0.14%), నెస్లే ఇండియా (0.12%). 


టాప్ లూజర్స్:


టాటా స్టీల్ (-4.47%), టెక్ మహీంద్రా (-2.76%), ఎన్టీపీసీ (-2.68%), టైటాన్ (-2.34%), రిలయన్స్ (-2.31%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa