ఐపీఎల్-2022లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. సోమవారం రాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ జట్టులో శిఖర్ ధావన్ (88*), రాజపక్స (42) పరుగులతో రాణించారు. చెన్నై బౌలర్లలో బ్రావో 2 వికెట్లు, తీక్షణ 1 వికెట్ తీశారు. 188 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నై జట్టులో అంబటి రాయుడు (78), రుతురాజ్ గైక్వాడ్ (30), జడేజా (21) రాణించారు. దీంతో 11 పరుగుల తేడాతో పంజాబ్ జట్టు విజయం సాధించింది. పంజాబ్ బౌలర్లలో రబాడా 2, రిషి ధావన్ 2, సందీఫ్ శర్మ 1, అర్షదీప్ సింగ్ 1 వికెట్ సాధించారు.