ఏపీలో వచ్చే ఎన్నికల్లోనూ ఎలాంటి పొత్తులు లేకుండా వైఎస్ఆర్‌సీపీ సింగిల్‌గా బరిలోకి దిగుతుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమది పోరాటం అయితే టీడీపీ-జనసేన పార్టీలది వావీవరుసలు లేని ఆరాటం అని పేర్కొన్నారు. బీజేపీని అనరాని మాటలు అన్నారని, తిరిగి ఆ రెండు పార్టీలో తిట్టిన పార్టీతో పొత్తుకు ఆరాట పడుతున్నాయన్నారు. బీజేపీతో కలిసి ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఏం ప్రయోజనం చేకూర్చారో చెప్పాలన్నారు. ప్రశాంత్ కిశోర్ వ్యవహారంపైనా స్పందించారు. ఆయనను తాము కన్సల్టంట్‌గానే నియమించుకున్నామని చెప్పారు. ఆయన చెప్పిన వాటన్నింటినీ చేయాలనే నిబంధన ఏదీ లేదని చెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉండబోదని మాజీ మంత్రి స్పష్టం చేశారు.
జాతీయ రాజకీయాలపై మొదటి నుంచి జగన్‌ది ఒకటే విధానమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎవరైతే ప్రకటిస్తారో వారికే జగన్ మద్దతు ఇస్తారని చెప్పారు. మరోవైపు చిరంజీవిపై పేర్ని నాని ప్రశంసల వర్షం కురిపించారు. వ్యక్తిగతంగా ఆయన మనసు చాలా మంచిదన్నారు. ఆయనకూ పవన్ కళ్యాణ్‌కూ చాలా తేడా ఉందన్నారు. పవన్‌ది నిలకడ లేని మనస్తత్వమన్నారు.