విజయవాడ వన్ టౌన్ లో 15 కోట్ల తో ముసాఫిర్ ఖానా ను బుధవారం సీఎం జగన్ ప్రారంభించనున్నారని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
గతం లో టీడీపీ ప్రభుత్వం మైనార్టీల పై దేశ ద్రోహం పెట్టిన చరిత్ర ఉందని ఆరోపించారు. ప్రతిపక్షం లో ఉండగా మైనారిటీల కు ఏమి చేయలేకపోయారని ప్రతి పక్షం లో ఉంటే ఒక లాగా అధికార పక్షం లో ఉంటే మరో లాగా టీడీపీ నేత చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మైనారిటీలకు వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా తోడుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.