మొన్న ప్రభుత్వ ఆసుపత్రిలో యువతి పై సామూహిక అత్యాచారం. నేడు మరో ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ప్రైవేట్ అంబులెన్స్ దందా కారణంగా అమానవీయ ఘటన. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అని ప్రశ్నించారు టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్. తిరుపతి ఆసుపత్రిలో జరిగిన సంఘటన మీద స్పందిస్తూ.. చేతగాని పాలకుడు జగన్ గారి చెత్త పాలన కారణంగా అనారోగ్యంతో చనిపోయిన కొడుకు మృతదేహాన్ని ప్రైవేట్ అంబులెన్స్ ల ధరలు తట్టుకోలేక బైక్ పైనే రాజంపేట జిల్లాలోని చిట్వేలుకు 90 కి.మీ. మేర బాలుడి మృతదేహాన్ని తరలించారు ఆ తండ్రి. గత తెలుగుదేశం ప్రభుత్వం పార్థివ దేహాన్ని ఉచితంగా తరలించే మహాప్రస్థానం రవాణా వాహనాలను ఏర్పాటు చేసింది. వైసిపి ప్రభుత్వం మహాప్రస్థానం వాహనాలను నిర్వీర్యం చెయ్యడం కారణంగానే ప్రైవేట్ అంబులెన్స్ దందా పెరిగి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా సీఎం గారు నిద్రలేచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు మెరుగుపర్చాలి అన్నారు.