పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించటంలో విఫలం అయిన బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం కొండపల్లి టౌన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కొండపల్లి బ్యాంకు సెంటర్ లో ఉదయం 10 గంటలకు జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కొండపల్లి టౌన్ కార్యదర్శి యం మహేష్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం ధరలు పెంచి, ప్రజలపై భారాలు వేస్తూ అప్రజాస్వామికంగా వ్యవహారిస్తూనారని అగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్, కరెంట్, బస్ చార్జీలు , నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో చెత్త పన్ను వేయవద్దని, పెంచిన ఇంటి పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారు, ఈకార్యక్రమంలో సిపిఎం కొండపల్లి పట్టణ కమిటీ సభ్యులు ఎ విఠల్ రావు, బడిషా వెంకటేశరావు, కె. బేబీ సరోజినీ, ఎల్. పార్వతి, ఎస్ వెంకట్రావమ్మ , యం సాంబశివరావు, కె నారాయణ, ఎస్ కె బాషా, పి బాబురావు తదితరులు పాల్గొన్నారు.