గుంటూరు: పరువు కోసం ఒక వ్యక్తి కృష్ణా నదిలో కి దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. కుమారులు చేసిన అప్పులు తీర్చినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడగా దాచేపల్లి ఎస్ఐ సుధీర్ కుమార్ సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడాడు.
కుమారులు అప్పులు చేస్తూ ప్రవర్తన మార్చుకో పోవడంతో మనస్థాపానికి గురై ఆత్మ హత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న తండ్రి కృష్ణా నదిలో దూకాడు. స్థానిక జాలర్ల సహాయంతో సుబ్బారావును దాచేపల్లి పోలీసులు కాపాడారు.