ఏపీలో మున్సిపల్ ఎన్నికల ట్రైబ్యునల్ లేకపోవడం చట్టవిరుద్ధమమంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కర్నూలుకు చెందిన సుధారాణి హైకోర్టులో దాఖలు చేసిన ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ జరిగింది. ట్రైబ్యునల్ ఏర్పాటు చేయకుంటే జిల్లా కోర్టుకు అధికారాలు ఇవ్వొచ్చని పిటిషనర్ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. పిటిషనర్లు హైకోర్టు వరకు రావాలంటే చాలా కష్టమవుతోందని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వారి వాదనలను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. అన్ని జిల్లాల జడ్జిలకు అధికారాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.