టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్లో పర్యటించాల్సిందిగా కేంద్రమంత్రి గడ్కరీ కోరారు. మస్క్ భారత్కు వచ్చి స్థానికంగా తయారీ కేంద్రాన్ని ప్రారంభించాలన్నారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అని.. ఇక్కడ పోర్టులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. టెస్లా కార్లను భారత్ నుంచి కూడా ఇతర దేశాలకు ఎగుమతులు చేయవచ్చని సూచించారు.