ఎర్రచందనం నిల్వల అమ్మకం ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతుందని అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అటవీ, పోలీసు అధికారులతో సమీక్షించిన మంత్రి.. ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 5,376.43 టన్నుల సీజ్ చేసిన ఎర్రచందనం నిల్వలు ఉన్నాయని, కేంద్రం అనుమతి రాగానే దాన్ని అమ్ముతామని తెలిపారు.