ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉసిరితో ఈ వ్యాధులకు చెక్!

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Apr 27, 2022, 12:31 PM

ఉసిరితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహం, క్యాన్సర్‌, గుండెజబ్బుల లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఉసిరి దివ్య ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. పరిగడపున ఉసిరిని తింటే మంచి ఫలితం ఉంటుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు.
- ఉసిరిలో విటమిన్‌ సీ పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి.
- ఉసిరి మధుమేహం, క్యాన్సర్‌, గుండెజబ్బు, రక్తపోటు మూత్రపిండాల సమస్యలను దూరం చేస్తుంది.
- ఉసిరి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడాన్ని నివారిస్తుంది. ఇన్సూలిన్‌ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. మలబద్దకం, థైరాయిడ్‌, అసిడిటీ ఇబ్బందులు ఉన్నవారు ఉసిరి తింటే మంచి ఫలితాలు ఉంటాయని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.
- ఉసిరి పొడిని ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. టీ స్ఫూన్‌ ఉసిరి పొడిని టీ స్ఫూన్‌ తేనెతో కలిపి తీసుకోవచ్చు. లేదా గోరు వెచ్చని నీళ్లలో కలిపి తీసుకోవచ్చు. భోజనం చేసిన రెండు గంటల తర్వాతనైనా తీసుకోవచ్చు. ఇందులో పుష్కలంగా విటమిన్‌ సీ ఉండటం వల్ల జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. ప్రస్తుత చలికాలంలో విరివిగా లభించే ఉసిరికాయను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com