క్రొత్తగా ఏర్పాటైన జిల్లాలలో ఒకటైన పల్నాడు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో నాటు సారా కాస్తున్న ప్రదేశాలపై ఆకస్మిక దాడి జరిపి 850 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, సంబంధించిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పల్నాడు జిల్లా పోలీసులు తేలియచేసారు. అలానే జిల్లాలో అనుమానిత ప్రదేశాలలో గుట్కా, పాన్, అక్రమ మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా జిల్లాలో ముఖ్యమైన ప్రదేశాలలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నామని పల్నాడు జిల్లా పోలీస్ అధికారులు తెలియచేసారు. జిల్లాలో ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడిన తగిన శిక్ష కి అర్హులవుతారు కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలి అని హెచ్చరించారు.