బోధిసిరి బోట్ మరోసారి లాంచింగ్ చేశాము. 2004లో వైఎస్సార్ చేతుల మీదుగా ప్రారంభించిన బోధిసిరిని తిరిగి నేను ప్రారంభించడం ఆనందంగా ఉంది. టూరిస్ట్‌లకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటాం. టూరిజంకు జగన్ గారు పెద్దపీట వేస్తున్నారు. టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తాం అని నగరి ఎమ్మెల్యే , టూరిజం మంత్రి రోజా మీడియా ముఖంగా తెలియచేసారు. ఇది చూసిన నెటిజెన్లు బోట్లో ఉన్నప్పుడు వేసుకోవలసిన లైఫ్ జాకెట్ ప్రెస్ మీట్ ముందు వేసుకున్నారు, కానీ అది వేసుకోవలసిన చోట అనగా బోటులో మాత్రం వేసుకోలేదు. మరి మేము మిమ్మల్ని చూసి ఏమి నేర్చుకోవాలి అని వాపోతున్నారు. ప్రజలకి మంత్రులు, ప్రజా ప్రతినిధులు మార్గదర్శంగా ఉండాలని హితవు పలికారు.