వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు అదనపు గదులకి శంఖుస్థాపన అనంతరం వినుకొండ వస్తున్న మంత్రుల కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకొంది. పైలట్ డ్రైవర్ నిర్లక్ష్యంతో సడన్ బ్రేక్ వేయడంతో మూడు కార్లు ఢీకొన్నాయి.
మంత్రి అంబటి రాంబాబు ఫోటోక్రాల్ వాహనం నుజ్జు నుజ్జు కాగా, మరో మంత్రి మెరుగ నాగార్జున ప్రోటోకాల్ వాహనం స్వల్పంగా దెబ్బతిన్నది. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు వాహనం స్వల్పంగా దెబ్బతిన్నది. కార్లు ఢీకొన్న సమయంలో మంత్రి కారులో ఉన్న ఎమ్మెల్యే బొల్లా కి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో వైస్సార్సీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.