ప్రతి రోజు ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగడం చాలా మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. నిత్యం ఇలా బ్లాక్ కాఫీ తాగే అలవాటు చేసుకున్నవారిలో గుండె ఆగిపోయే ప్రమాదాన్ని 12 శాతం తగ్గిస్తుందని కొలరాడో స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. కాఫీ తాగే అలవాటు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని తేలింది. చైనా మెడికల్ యూనివర్శిటీ తన ఇటీవలి పరిశోధనలో బ్లాక్ కాఫీ తాగే వారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని 10 శాతం తగ్గినట్లు గుర్తించారు. క్యాన్సర్‌తో పోరాడుతున్నప్పుడు కాఫీ తాగడం 16 శాతం మేర మంచిదైందని చైనా పరిశోధకులు చెప్తున్నారు.
కాలేయం, రొమ్ము, పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని బ్లాక్ కాఫీ తగ్గిస్తుందని గత పరిశోధనలో నిరూపితమైంది. బ్రిటీష్ మెడికల్ జర్నల్‌లోని పబ్లిక్ రీసెర్చ్ ప్రకారం, తక్కువ, ఎక్కువ కాఫీని ఉపయోగించే వ్యక్తులపై ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పరిశోధకులు అర్థం చేసుకున్నారు. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కప్పులు లేదా అంతకంటే ఎక్కువ కాఫీ తాగుతున్న వ్యక్తులు ఇందులో ఉన్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్న 57,732 మంది రోగుల డేటాను కూడా పరిశోధనలో చేర్చారు. బ్లాక్ కాఫీ తాగే వారిలో ఆయుష్షు పెరుగడం, ఎనర్జీ బూస్టింగ్ పొందడం, శరీరం బరువు తగ్గిపోవడం, కాలేయం ఆరోగ్యవంతంగా తయారవడం, డిప్రెషన్‌కు గురికాకుండా ఉంటారని తేల్చారు.